ATP: రాప్తాడు నియోజకవర్గంలో పదవీ కాలం ముగిసిన పలువురు సర్పంచులకు సోమవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని, గత ఐదేళ్లలో గ్రామాల్లో వారు చేసిన సేవలను గుర్తిస్తూ సన్మానించారు. రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్, కనగానపల్లి, రామగిరి మండలాలకు చెందిన సర్పంచ్లు పాల్గొన్నారు.