RR: షాద్నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండలం గుంజల్పాడ్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి హనుమాన్ దేవాలయంలోని శివలింగాన్ని దుండగులు పెకిలించి, ఆ స్థలంలో గణేషుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కలకలం రేపింది. ఈ అరాచకానికి పాల్పడిన వారెంతటి వారైనా తేల్చాలని పోలీసులను కోరినా స్పందన లేదంటూ ఓ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది.