HYD: లీగల్ చిక్కులు రాకూడదని TGIIC రికార్డుల్లో ‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ’గానే పేర్కొంటూ తాజాగా ఇంజినీరింగ్ కన్సల్టెంట్ కోసం ప్రతిపాదనలు ఆహ్వానించింది. కానీ, FCDA మాత్రం దీనిని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’గా పిలుస్తోంది. ఇలా ఒకే ప్రాజెక్టుకు రికార్డుల్లో ఒక పేరు, ప్రచారంలో మరో పేరు ఉండటంతో అధికారుల మధ్య పేరు విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.