TG: రాష్ట్రంలో ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ తొలిసారిగా ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అధిక ఎండలు, అతి తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వడగాల్పుల తీవ్రతపై ఇలా రెడ్ అలర్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని అధికారులు సూచించారు.