KRNL: ఆదోని మండలం కపటి గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్క్ భూమి పూజ కార్యక్రమం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ఎమ్మెల్యే పార్థసారధి వాల్మీకి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుందని నాయకులు తెలిపారు.