WG: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధనతో పాటు ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తోందని ఎంఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఏలూరుపాడులో సోమవారం విద్యార్థుల ప్రవేశాలకై ఉపాధ్యాయులతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యా యులతో నాణ్యమైన విద్య అందుతుందని, ప్రైవేటుకు దీటుగా ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని వివరించారు.