AP: రాజధాని పేరుతో అమరావతి రైతులను నట్టేట ముంచారని మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ప్లాట్లు ఎక్కడున్నాయో వారికే తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. అమరావతిని గుదిబండగా మార్చారన్నారు. రాష్ట్రంలో డబ్బులివ్వందే ఏ పనీ జరిగే పరిస్థితి కనిపించడం లేదని ఆరోపించారు. నాడు టీడీపీకి మద్దతిచ్చిన NRIలు నేడు నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు.