HYD: హైదరాబాద్ మెట్రో రైలుకు రూ. 13,600 కోట్ల రీఫైనాన్సింగ్ కోసం ఎల్అండ్టీ మెట్రో రైల్, ఐఆర్ఎఫ్సీ ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణ సీఎస్, ఐఆర్ఎఫ్సీ సీఎండీ మనోజ్ కుమార్ దూబే సమక్షంలో ఈ సంతకాలు జరిగాయి. ప్రస్తుత రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు 20 ఏళ్ల కాలపరిమితితో, త్రైమాసిక చెల్లింపుల పద్ధతిలో ఐఆర్ఎఫ్సీ ఈ భారీ రుణ సదుపాయాన్ని హైదరాబాద్ మెట్రోకు కల్పించనుంది.