VZM: అమృత్ పథకం 2.0లో భాగంగా పట్టణంలో 10 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. విజయనగరం 39వ డివిజన్ అలకానంద కాలనీ మునిసిపల్ పార్కులో నిర్మించిన ఇంకుడు గుంతను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రారంభించారు. భూగర్భ జలాలు పెంచేందుకు ఇవి దోహదపడతాయని వారు తెలిపారు.