మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో అమరుడు పోగుల శ్రీనివాస్ గౌడ్ స్తూపాన్ని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి విజయసారథి సోమవారం ఆవిష్కరించారు. శ్రీనివాస్ గౌడ్, కుటుంబ సభ్యులతో పాటు కార్యకర్తలు భారీగా హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరుణోదయ కళాకారులు ఆటపాటలతో హోరెత్తించారు. తోటలాలయ్య, సుక్కు తదితరులు పాల్గొన్నారు.