AP: ఈ ఏడాది 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకో సిస్టమ్‌గా మారుస్తామని, 100 యూనికార్న్ సంస్థలు రావాలనేది లక్ష్యమన్నారు. కియా, గూగుల్, ఆర్సెలార్ మిత్తల్ లాంటి సంస్థలు వచ్చాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని తెలిపారు. దేశంలోనే నంబర్1 పార్కుగా శ్రీసిటీ మారిందన్నారు.