TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 26 వరకు ఉత్తర, దక్షిణ తెలంగాణకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా హీట్ వేవ్ నమోదు అయింది. భద్రాచలంలో 45.6 డిగ్రీలు, ఖమ్మంలో 45.4, హనుమకొండలో 44.0, రామగుండంలో 44.1, ఆదిలాబాద్లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.