GDWL: మల్దకల్ మండలం చెర్ల గార్లపాడు గ్రామంలో కురిసిన ఉరుముల వర్షానికి పిడుగుపడి రూ. 18 లక్షల విలువైన ఎద్దు అక్కడికక్కడే మృత్యువాత పడింది. గ్రామానికి చెందిన నీలవేణి, రామాంజనేయులు దంపతులు వ్యవసాయం చేసుకుంటూ ఈ ఎద్దును ఎంతో ప్రాణప్రదంగా పెంచుకుంటున్నారు. పిడుగుపాటుతో ఎద్దు మరణించడంతో తాము కోలుకోలేని విధంగా నష్టపోయామని బాధితులు తెలిపారు.