AP: మంత్రి లోకేష్ ఇవాళ సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో లోకేష్ పాల్గొననున్నారు. ‘అప్నాపన్: మై ఎక్స్పీరియెన్సెస్ విత్ మోదీ’ పుస్తకాన్ని శివరాజ్‌సింగ్ చౌహాన్ రచించారు. కేంద్రమంత్రి ఆహ్వానం మేరకు లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం.