KRNL: ఈ నెల 27న తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, MLAలు బాలనాగిరెడ్డి, విరూపాక్షి, MLCలు మధుసూదన్, ఇసాక్ బాషాతో మరికొందరు నేతలు హాజరుకానున్నారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఈ భేటీలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.