నెల్లూరులో ఆజాద్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను రాష్ట్ర వర్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇవాళ పర్యవేక్షించారు. నిర్మాణ ప్రాంతంలోని నేల స్వభావం, సీపేజ్ సమస్యల వల్ల ప్రారంభంలో పనులు ఆలస్యమయ్యాయన్నారు. ప్రస్తుతం జియో సింథటిక్ మెటీరియల్, గ్రావెల్ వినియోగించి పునాదులను పటిష్ఠం చేసే పనులు వేగవంతం చేశామని ఆయన తెలిపారు.