కోనసీమ: మే 27, 28 తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, సరికొత్త డిజిటల్ వేదికగా జరగబోయే ‘పసుపు పండుగ’ కోసం అమలాపురం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు నడుం బిగించాయి. అమలాపురం రూరల్ మండలం క్లస్టర్-1 వేదికగా జరగనున్న ఈ మహానాడు కార్యక్రమం కోసం డిజిటల్ స్క్రీన్స్, సిట్టింగ్ ప్లానింగ్ జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు ఇవాళ పరిశీలించారు.