BHNG: ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య – బీర్ల అనిత తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.