TG: పండిన ధాన్యమంతా ప్రభుత్వం తప్పక కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు ఆలస్యం అవుతోందని తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇసుక లారీలు, ట్రాక్టర్లను కూడా ధాన్యం తరలింపు కోసం వాడుతున్నామని పేర్కొన్నారు. ఈలోపు వర్షం పడి ధాన్యం తడిసినా.. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు.