AP: తిరుపతి వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీలో చిరుత సంచారంపై Dy. CM పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. చిరుతను పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని అటవీశాఖ ఉన్నతాధికారులతో పవన్ రాజమండ్రి నుంచి ఫోన్లో మాట్లాడారు. చిరుత ప్రస్తుతం గదిలో నక్కి ఉందని సిబ్బంది అక్కడికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. చిరుతకు ఎలాంటి హాని కలగకుండా పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని సూచించారు.