TG: ధాన్యం కొనుగోళ్లపై BRS, BJP నాటకాలు ఆడుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్రంలో కోటి టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చిందని.. కేంద్రప్రభుత్వం 52 లక్షల టన్నులనే కొనుగోలు చేస్తామని చెప్పిందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల గురించి మాట్లాడే హక్కు BJP నేతలకు లేదన్నారు. మొత్తం ధాన్యం కొనాలని బీజేపీ నేతలు కేంద్రానికి చెప్పాలని కోరారు.