KMM: వడదెబ్బ తగలకుండా ఉపాధి హామీ కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సత్తుపల్లి MPDO నాగేశ్వరరావు అన్నారు. సోమవారం సత్తుపల్లి (M) రుద్రాక్షపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను MPDO తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ నాగేంద్రబాబుతో కలిసి ఎంపీడీవో కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణి చేశారు.