VZM: రాజాం పట్టణ పరిధిలోని గాయత్రీకాలనీ 3వ లైన్ నుంచి 2వ లైన్‌కి వెళ్లే మార్గంలో నిర్మించిన కాలువపై అధికారులు పలకలు ఏర్పాటు చేయలేదు. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో వాహనాలు వెళ్లలేక ఇబ్బందులు గురవుతున్నామన్నారు. అధికారులు స్పందించి వెంటనే పనులు చేపట్టాలని కోరారు.