BDK: లక్ష్మీదేవి పల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీలో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. రాములమ్మ అనే మహిళపై వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. స్పందించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వీధి కుక్కలను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు మండిపడ్డారు.