NLG: చిట్యాల పురపాలిక కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఛైర్పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్‌తో కలిపి 12 మంది కౌన్సిల్ సభ్యులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. మొత్తం 23 మంది నామినేషన్లు సమర్పించగా, వారిలో పాటి మాధవరెడ్డి, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్యలకు మెజారిటీ సభ్యులు మద్దతు ప్రకటించారు.