NLR: ఆత్మకూరు మండలం బట్టేపాడులో ఇవాళ దారుణ ఘటన చోటుచేసుకుంది. సుమతి అనే మహిళ తన తల్లి రవణమ్మ గొంతు కోసింది. తీవ్రంగా గాయపడిన రవణమ్మను స్థానికులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు రెఫర్ చేశారు. ఘటనపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ SI జిలానీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.