SRPT: హుజూర్నగర్ పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంత్రి ఆదేశాల మేరకు ఈరోజు మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, హుజూర్ నగర్ మండలంలోని బేతవోలు వాటర్ లైన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు.