BDK:పినపాక నియోజకవర్గ ప్రజలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మాజీ ZPTC పాల్వంచ దుర్గ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు అధికమవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచే భగ్గుమనే ఎండలు, వేడి గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.