KRNL: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోనెగండ్ల మండలానికి చెందిన సమగ్ర శిక్ష మండల అకౌంటెంట్ శ్రీనివాసులు కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్‌ను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సోమవారం అందజేశారు. స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసులు భార్య మంజులకు కలెక్టర్ చెక్కను అందించారు.