AP: ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 550 ఇండస్ట్రీయల్ పార్కులు ఉన్నాయన్నారు. ఎంఎస్ఎంఈలను అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.