HNK: పాలకుర్తి ఇరిగేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డీఈ శ్రీకాంత్ సోమవారం హన్మకొండ భవానీనగర్‌లోని తన ఇంట్లో రూ. 50 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అధికారిక పనుల కోసం లంచం తీసుకుంటున్న సమయంలో దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.