TG: సీపీఐ నేతల బృందం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయింది. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ సత్యం, ఇతర ముఖ్య నేతలు సచివాలయంలో సీఎంను కలిశారు. కనీస వేతనాల పెంపుపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దీని త్వరితగతిన చర్యలు చేపట్టి రైతులకు సహకరించాలని కోరారు.