TG: HYD మెట్రో రైలు 100 శాతం యాజమాన్యం వాటా రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ అయిందని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. మెట్రో ఆర్థికభారం తగ్గించేందుకు రీఫైనాన్సింగ్ దోహదపడుతుందన్నారు. పట్టణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. దేశ ఆర్థికవృద్ధికి HYD కీలక ఇంజిన్‌గా ఎదుగుతోందని చెప్పారు.