KMM: సత్తుపల్లి సమీపంలోని యాతాలకుంట వద్ద సీతారామ ప్రాజెక్టు టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, అధికారులతో కలిసి టన్నెల్ లోపలికి వెళ్లిన మంత్రి పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.