HYD: నగరంలో 2.5 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చిన మనసున్న నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘ఇందిరమ్మ రాజ్యమంటూ గద్దెనెక్కి పేదల ఇండ్లను కూలుస్తూ వారి బతుకులను రోడ్డున పడేస్తున్న రేవంత్’ అంటూ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలతో పేదలను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు.