TPT: తిరుపతి నగరంలో నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా కమిషనర్ శారదా దేవి సోమవారం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గోదాదేవి మార్గం, గాంధీ భవన్, మంచినీళ్ల కుంట ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలను అధికారులు సమక్షంలో తనిఖీ చేశారు. జూన్ 22 వరకు నగరమంతా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.