SS: ధర్మవరం రూరల్ మండల టీడీపీ కార్యాలయంలో మహనాడు కార్యక్రమ ఏర్పాట్లపై పరిటాల శ్రీరామ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సమీక్ష నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈనెల 27, 28 తేదీల్లో వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మహనాడును విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.