BDK: బూర్గంపాడు మండలంలో అక్రమ బెల్ట్ షాపుల వ్యవహారం రోజురోజుకీ పెరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగుతుండటంతో యువత మద్యానికి బానిసలవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.