క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బయోపిక్ ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ త్వరలో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆహా సంస్థ అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది. 2017లో జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వంలో వచ్చిన ఈ డాక్యుమెంటరీనే ఆహాలో టెలికాస్ట్ చేయనున్నారా? లేక కొత్త సిరీస్ రూపంలో తీసుకురానున్నారా? అనేది తెలియాల్సి ఉంది.