ATP: రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు రూ.26 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అనంతపురం క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. నియోజకవర్గ అబ్జర్వర్ పద్మలతారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత లబ్ధిదారులకు వీటిని అందజేశారు. సీఎం సహాయనిది పేదల పాలిట వరమని ఆమె కొనియాడారు.