WG: తణుకు పరిధిలోని ఇరగవరం రోడ్డులో సోమవారం పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడి పెట్రోల్ బంకును ఆనుకుని ఉన్న పచ్చగడ్డిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఆఫీసర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.