TG: ఇవాళ్టి నుండి ఈనెల 30వ తేదీ వరకు జరిగే ‘మహిళా వారోత్సవాలను’ విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఇది మహిళల ఆత్మగౌరవ మహోత్సవమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, 8 వేల మహిళా భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.