NLG: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరడంతో రైతుల్లో ఊరట నెలకొంది. కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురైన లారీల కొరత, దిగుమతుల జాప్యం వంటి సమస్యలను జిల్లా యంత్రాంగం అధిగమించి ప్రక్రియను వేగవంతం చేసింది. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఇప్పటివరకు 90 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి.