KMR: జిల్లాలో అనుమానస్పద రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. సుమారు 50 రోజుల పాటు నిర్వహించిన సర్వేలో జిల్లావ్యాప్తంగా 3,644 రేషన్ కార్డులను రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 6422 అనుమానస్పద కార్డుల జాబితా పంపించింది. దాని ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అధికారులు 1098 మంది అర్హులు ఉన్నట్లు గుర్తించారు.