TG: హైదరాబాద్లోని కూకట్పల్లిలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశం చేపట్టారు. 2014లో హైదరాబాద్ ఎలా ఉండేదో.. పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 2.50 లక్షల ఇళ్లను క్రమబద్ధీకరించామని తెలిపారు. నగరంలో కాంగ్రెస్ ఒక్క ఇల్లు అయినా కట్టిందా? అని నిలదీశారు. శని, ఆదివారాల్లో ఇళ్లను హైడ్రా కూలగొడుతోందని మండిపడ్డారు.