VSP: పోలీసు సిబ్బందిలో మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్రైనింగ్ వింగ్ ఆధ్వర్యంలో కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ మైదానంలో నిర్వహించిన మూడు రోజుల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ శిక్షణ సోమవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి హాజరైన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి సిబ్బందితో కలిసి ధ్యాన సాధన చేశారు.