MHBD: ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన కేతిరి ఉప్పలయ్యను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూతాటి కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించడం చాలా ఆనందంగా ఉందని, సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.