ఇవాళ రాత్రి 8:24 గంటలకు రోహిణి కార్తె ప్రారంభం కానుందని పంచాంగం పేర్కొంది. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కిరణాలు నేరుగా భూమిని తాకి, రోళ్లు పగిలే స్థాయిలో ఎండలు ఉంటాయని నానుడి. ఆ తర్వాత జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఆ సమయంలో నైరుతి రుతుపవనాలు విస్తరించి, వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడి వ్యవసాయ పనులు జోరందుకుంటాయి.