అక్కినేని నాగార్జున హీరోగా రా. కార్తీక్ దర్శకత్వంలో ‘కింగ్ 100’ మూవీ రాబోతుంది. ఈ మూవీలో ఇప్పటికే సీనియర్ నటి టబు కీలక పాత్రకు ఎంపికవగా, తాజాగా సుస్మితా భట్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో మెరవనున్నట్లు టాక్. అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ క్యామియో రోల్స్‌లో కనిపించబోతున్నారట. ఇందుకోసం దర్శకుడు ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం.