గద్వాల జిల్లాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.117.2, డీజిల్ రూ.105కు చేరడంతో ప్రజలపై ఆర్థిక భారం పెరిగింది. వరుసగా పెరుగుతున్న ధరలతో వాహనదారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని సామాన్యులు చెబుతున్నారు. ఇంధన ధరలను నియంత్రించి ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.